63వ డివిజన్ శివాలయం వీధిలో ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన
పేదలకు సొంతింటి కల నెరవేర్చడంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది — కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ రజాలి
9 వ్యూస్ ప్రతినిధి కే సుదర్శన్ హనుమకొండ, కాజీపేట నవంబర్ 27:వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 63వ డివిజన్ శివాలయం వీధిలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయ్ శ్రీ సయ్యద్ రజాలి పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, పేదలకు సొంతింటి కల నెరవేర్చడంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకం వరమైందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించాలన్న సంకల్పంతో ప్రజాపాలనలో ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షపాతిగా పనిచేస్తోందని తెలిపారు.
పేద కుటుంబాలు సురక్షిత గృహాల్లో నివసించాలన్న దృక్పథంతో శ్రమిస్తున్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆరూరి సాంబయ్య, క్రాంతి, భరత్ రాజ్, గుంటి కుమార్, స్వామి, పోగుల రాకేష్, పల్లపు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

