"దిత్వా" తుఫాను పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి శాసనసభ్యులు నల్లారి.
*బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన "దిత్వా" తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజవర్గ ప్రజలకు సూచించారు.*
*"దిత్వా"తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు ఉన్న కారణంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు, రైతులు, ముఖ్యంగా పిల్లలు అన్ని విధాల జాగ్రత్తలు పాటించాలని,*
*వర్షాల కారణంగా విద్యుత్ పట్ల జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలకు చెరువులు, కుంటలు, కాలువలు, నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్ళనీయకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.*
*రాబోయే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల "దిత్వా" తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు, వీచే అవకాశం ఉందని అన్ని ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.*

