CMRF చెక్కుల పంపిణీ
9views digital news సూర్యాపేట జిల్లా, జులై 11 : సూర్యాపేట నియోజకవర్గం ఈరోజు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్
శ్రీ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల
18 మంది లబ్దిదారులకు మొత్తం రూ. 7,81,000/- విలువైన చెక్కులను అందజేశారు.
ప్రతి ఒక్కరికి అవసరమైన వైద్య చికిత్స కోసం ఈ సాయాన్ని మంజూరు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లబ్దిదారుల కుటుంబ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం మా బాధ్యత. ప్రతి అవసరమైన కుటుంబానికి సాయం అందేలా కృషి చేస్తాను.” అని తెలిపారు.
గత ఆరు నెలల కాలంలో ఇప్పటివరకు సూర్యాపేట నియోజకవర్గంలోని 55 మంది లబ్దిదారులకు రూ. 24,70,500/- విలువైన
సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైంది. ఇది ప్రజల సంక్షేమానికి ప్రభుత్వపు నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది అని తెలిపారు...
అదే విధంగా ఈ నెల 14న తుంగతుర్తిలో జరగనున్న ముఖ్యమంత్రి సమావేశానికి అందరూ తప్పనిసరిగా హాజరుకావాలంటూ పిలుపునిచ్చారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాప్రయోజనాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యమైన దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు.
అందుకే అందరు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.